గడిచిపోయినది(Sumathi Payam-Gadichipoyinadi)
తెలివిగా , జాగ్రత్తగా వుండాలి.
చింతింపకు గడచినపని
కింతులు వలతు రని నమ్మ కెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మాను మిదియు మతముర సుమతీ !
తెలివిగా , జాగ్రత్తగా వుండాలి.
చింతింపకు గడచినపని
కింతులు వలతు రని నమ్మ కెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మాను మిదియు మతముర సుమతీ !
సమయానికి తగినట్టు , ప్రేమతో , భయపెట్టో పనులు చేయించుకోవాలి.
నయమునఁ బాలును ద్రావరు
భయమున విషమైనగాని భక్షింతురుగా
నయ మెంత దోసకారియొ
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ !
ఎవరు చేసే పనులు వారే చేయాలి ,ఇంకొకరు చేయరాదు.
నరపతులు మేర దప్పిన
దిర మొప్పఁగ విధవ యింట దీర్పరి యైనన్
గరణము వైదికుఁ డైనను
మరణాంతకమౌనుగాని మానదు సుమతీ !
ఎవరేది చెప్పినా చెప్పినా వెంటనే నిర్ణయం చేయకుండా విచారణ చేయాలి.
దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
నెగ్గు ప్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ !
సమయానికి తగినట్టు మంచి మాటలు మాట్లాడాలి.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక, తానొవ్వక,
తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ !
డబ్బు చూసి మనతో స్నేహం చేసేవారిని నమ్మరాదు.
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పలుగఁ జెరువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ !
మంచి నడవడిక కలిగి వుండాలి
కులములోన నొకఁడు గుణవంతుఁ డుండిన
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజం బున్నట్టు
విశ్వదాభిరామ వినుర వేమ.
అందం చూసి మోసపోకూడదు
మిరెపుగింజ చూడ మీద నల్లగనుండు
కొరికి లోనచూడ జుఱుకుమనును
సజ్జను లగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినుర వేమ.
చెడ్డ వారితో స్నేహం ప్రమాదం.
వేఱు పురుగు చేరి వృక్షంబు జెఱుచును
చీడపురుగు చేరి చెట్టు జెఱుచు
కుత్సితుందు చేరి గుణవంతుఁ జెఱుచురా
విశ్వదాభిరామ వినుర వేమ.
మంచి ప్రవర్తన కలిగి వుండాలి
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమ.